Six Lane Highway Repair Hyderabad – మియాపూర్ నుంచి గండిమైసమ్మ వరకు

Telanganapatrika (జూలై 19) :  Six Lane Highway Repair Hyderabad, మియాపూర్ నుండి గండిమైసమ్మ వరకు 6 లైన్ల రహదారి విస్తరణ, మరమ్మత్తులు త్వరగా చేపట్టాలని నిర్ణయం.

Join WhatsApp Group Join Now

Six Lane Highway Repair Hyderabad – Road Expansion Updates

Six Lane Highway Repair Hyderabad.

మియాపూర్ నుండి గండిమైసమ్మ వరకు 6 లైన్ల రోడ్డు విస్తరణ, బాచుపల్లి ఫ్లై ఓవర్ మల్లంపేట్ ఎగ్జిట్ ORR నుండి బాచుపల్లి వరకు రోడ్డు విస్తరణ, కొంపల్లి నుండి బహదురుపల్లి, గండిమైసమ్మ నుండి బాచుపల్లి వెళ్లే రహదారిలో 1. 5 కి మీ రోడ్డు ఫారెస్ట్ ని అనుకోని ఉండడం వల్ల ఫారెస్ట్ సంబందించిన అనుమతుల గురించి శుక్రవారం మినిస్టర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీదర్ బాబు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ప్రణాళిక రూపొందించి జులై నెలాకరు లోపు పనులు పూర్తిచేసుకోని సెప్టెంబర్ లో ప్రారంభించాలని సూచించారు. జీడిమెట్ల నుండి షాపూర్ వెళ్లే పైప్ లైన్ రహదారి లో షీల్డ్ బ్రిడ్జి పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్, GHMC & HMDA కమిషనర్లతో, రెవిన్యూ డివిజినల్ & జోనల్ కమీషనర్ అధికారులతో మాట్లాడి తహసీల్దార్ కు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి, మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సరెడ్డి భూపతి రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి వజ్రేష్ యాదవ్, ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జి పరమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు .

Read More: Etela Rajender : నేను వచ్చాకే బీజేపీకి మెజారిటీ..!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) : https://www.ghmc.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *