Telanganapatrika (June 14): Silling lands illegal registration, కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజు పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 407/2 లో 71గుంటల కు సంబంధించిన భూమికి 1979 వ సంవత్సరం నుండి సిలింగ్ యాక్ట్ అమలులో ఉంది. సిలింగ్ యాక్ట్ అములులో ఉన్న భూమిని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అధికారులతో కలిసి పట్టా భూమిగా మార్చుకొని 2005 నుండి ఇప్పటి వరకు దాదాపు 50 కి పైగా రిజిస్ట్రేషన్లు చేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు.
గతంలో సర్వే నంబర్ 407/2 లోని 71 గుంటల భూమిని గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వం సీలింగ్ భూమి అయినప్పటికీ కొందరు అధికారులు భూ అక్రమార్కులతో చేతులు కలిపి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు అని ప్రజలు అనుమానిస్తున్నారు.ప్రభుత్వo సీలింగ్ లో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ లు చేస్తారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ వారు 407/2 సర్వే నెంబర్ కి సంబంధించిన 71 గుంటల భూమిని ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎంట్రీ చేయలేదు, రెవెన్యూ శాఖ వారు సిలింగ్ యాక్ట్ ఆర్డర్ కాపీ నోటీసులు సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి అధించింద? అని ప్రజలు ప్రశ్నింస్తున్నారు, ఒక వేల నోటీసు లు అధించిన ప్రోహిబిటెడ్ లిస్ట్ లో ఎంట్రీ చేయకుండా అక్రమ రిజిస్ట్రేషన్ల చెలామణి కోసం ప్రజలను మోసం చేసారా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.2005 లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ శాఖ వారు రిజిస్ట్రేషన్ చేసిన భూమి యొక్క మ్యుటేషమ్ మరియు వ్యవసాయం పాస్ పుస్తకం ఇవ్వవాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖ వారిదే. సర్వే నెంబర్ 407/2 లో 18 గుంటల 2005 లో వ్యవసాయ భూమిగా రిజిస్ట్రేషన్ కాబడినది.
- ప్రభుత్వం సీలింగ్ లో ఉన్న భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు.
- వెంటనే రిజిస్ట్రేషన్ లు రద్దుచేయాలని గ్రామస్తుల డిమాండ్.
- సర్వే నెంబర్ 407/2 రిజిస్ట్రేషన్ శాఖ ప్రోహిబిటెడ్ లిస్ట్ లో లేదు.
- రెవెన్యూ అధికారులు పాతినా హేచ్చరిక బోర్డు మాయం.

Silling lands illegal registration 2025
రెవెన్యూ శాఖ వారు ఈ రిజిస్ట్రేషన్ యొక్క జవాబంది మ్యుటేషన్ అపి సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి ఈ సర్వే నెంబర్ సిలింగ్ యాక్ట్ అమలు లో ఉండగా రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అని పై అధికారులతో అప్పటి సబ్ రిజిస్ట్రార్ ని ప్రశ్నించకపోవడం? ఈ క్రయ విక్రయల గూర్చి అప్పటి తహసీల్దార్ కి తెలిసి కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ప్రజల్లో పలు అనుమానం చెలరేగుతున్నాయి. ఈ 407/2 సర్వే నెంబర్లో క్రయ విక్రయలు జరుగుతున్న విషయం పై అధికారులకి తెలియదా? తెలిసిన తెలియనట్టు ఉంటున్నారా అని ప్రజలు ప్రశ్నింస్తున్నారు. గత రెండు మూడు సంవత్సరాలనుండి ఈ సమస్య గూర్చి రెవెన్యూ అధికారులకి గ్రామ ప్రజలు దరఖాస్తులు ఇవ్వడమైనది. అధికారులు కూడా హేచ్చరిక బోర్డు ఈ సర్వే నెంబర్ గాల భూమి లో పాతరు, కానీ ఆ హేచ్చరిక బోర్డు పాతిన రెండు రోజులో ఎవరో తీసేసారు అని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు.ఇంత అవినీతి జరిగిన పై అధికారులలో ఎలాంటి చలనం లేదు అని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని క్రయ విక్రయలు జరిగిన ఇప్పటికీ ధరణిలో నిరుపేద దళితుల పైనే భూమి ఆన్లైన్లో చూపిస్తుంది అని అన్నారు.

అత్యంత విలువైన సీలింగ్ భూమిని గ్రామపంచాయతీ, లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు, ఇండ్లులేని నిరుపేదలకు కేటాయించాలని అప్పట్లో గ్రామపంచాయతీ గ్రామసభలో తీర్మానం చేశారు అని అన్నారు. ఇట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామావసరాలకు వినియోగించాలని పలుమార్లు జిల్లా కలెక్టర్కు, ఆర్డీవో, తహసీల్దారు లకు గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కొత్తపల్లి లో మండలంలో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న భూములను రద్దు చేసినట్లు గానే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని దేశరాజు పల్లి లోనీ సీలింగ్ లోనున్న 71 గుంటల అక్రమంగా రిజిస్ట్రేషన్ లను కూడా రద్దు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఈ భూమి స్థలాలు ఇచ్చేందుకు, గ్రామ అవసరాల కోసం వినియోగించుకునేందుకు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!