
TELANGANA PATRIKA(MAY26) , సిద్దిపేట జిల్లాలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని అంతం చెయ్యాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్ లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) అబ్దుల్ హమీద్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…
జిల్లాలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని అంతం చేయడానికి ఏక్కడి నుండి రవాణా అవుతుందో నిఘా పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో డ్రగ్స్ పై అవగాహన కల్పించేందుకు వీడియోలు, పోటోలలతో ప్రచారం చెయ్యాలన్నారు. విద్యాసంస్థలలో మత్తుపదార్థాల వినియోగంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని, డ్రాపౌట్ అయిన విద్యార్థులు లేదా ఇతరులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్టు తెలిసినపుడు, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు అధికారులను ఆదేశించారు.
డ్రగ్స్ బారిన పడిన, పిల్లల ప్రవర్తనలో వ్యత్యాసం వచ్చిన వారిని జిల్లా అసుపత్రిలో డి-అడిక్షన్ సెంటర్ కి పంపించాలని సూచించారు. రాజీవ్ రహదారుల వెంబడి అనధికారిక డివైడర్ కటింగ్స్ లను ముసి వెయ్యాలని అలాగే ఇతర గ్రామాల నుండి రహదారి కలిసే ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్లు వెయ్యాలని, రోడ్ల పైన వరి ధాన్యం ఆరాపొయ్యడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని… సంబంధిత అధికారులు, పోలిస్ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, జీజీహెచ్ సూపరిండెంట్ శాంతి, అర్ అండ్ బి డిఈ వెంకటేష్, నేషనల్ హైవే, ట్రాఫిక్, పోలీస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read : సిద్దిపేటలో ఈనెల 28 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు: కమిషనర్ డాక్టర్ బి. అనురాధ