Telanganapatrika (July 25): Sangareddy Collector, సంగారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటూ వ్యాధులు ప్రబలకుండా వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య సిబ్బంది, గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Sangareddy Collector వ్యాధుల నివారణకు కార్యాచరణకు సిద్ధం కావాలి..
అత్యవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని ఊర్లు రోడ్లు కొట్టకపోయి ఉన్నాయి కాబట్టి ఆ యొక్క గ్రామాలను అందరూ సందర్శించి ఏ వ్యాధులు లేకుండా చూడాలని ఆమె తెలిపారు. ప్రతి ఒక గ్రామంలో వైద్య సిబ్బంది తప్పకుండా ఉండాలని లేనియెడల కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యులు అందుబాటులో గ్రామాల్లోనే ఉండి ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా అవగాహన కల్పించి ప్రతి గ్రామానికి సందర్శించాలని ఆమె తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu