
TELANGANA PATRIKA(JUN 2) , IPL 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) భారీ విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ముంబయి ఇండియన్స్ (MI) పై రెండో క్వాలిఫయర్‌లో ఘన విజయాన్ని నమోదు చేసింది. 200కు పైగా లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించి చరిత్ర సృష్టించింది. కెప్టెన్ అయ్యర్ 87 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. చివర్లో విజయ షాట్‌తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. వధేరా 48, ఇంగ్లిస్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు.
MIకు చేదు అనుభవం – 200+ స్కోరు చేసినప్పటికీ ఓటమి..!
ఈ మ్యాచ్‌లో ముంబయి 200కు పైగా పరుగులు చేసినప్పటికీ పరాజయాన్ని చవిచూసింది. IPL చరిత్రలో ఇది MIకి తొలిసారి. అశ్వని కుమార్ 2 వికెట్లు తీయగా, బౌల్ట్ మరియు పాండ్య చెరో వికెట్ తీశారు. మైదానంలో భారీ స్కోరే అయినా కూడా పంజాబ్ బ్యాటింగ్ అద్భుతంగా నిలిచింది.
రేపు ఫైనల్ – RCB vs PBKS
ఇప్పటికే ఫైనల్‌కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో రేపు పంజాబ్ తలపడనుంది. ఈ ఫైనల్ పోరుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రెండు జట్లూ ట్రోఫీ కోసం పోటీపడతుండటంతో మ్యాచ్‌కి మరింత క్రేజ్ పెరిగింది.
Read More: Read Today’s E-paper News in Telugu