OnePlus 13s Price in India: కొత్త ఫోన్ ధర, ఫీచర్లు తెలిసి షాక్ అవుతారు

Telanganapatrika (June 5): OnePlus 13s Price in India, భారత మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించిన OnePlus 13s స్మార్ట్‌ఫోన్ టెక్ ప్రియులను ఆకర్షిస్తోంది. ఈ హైఎండ్ ఫోన్, OnePlus యొక్క పవర్‌ఫుల్ మోడల్స్‌లో ఒకటిగా నిలిచింది. Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్‌తో రూపొందించిన ఈ ఫోన్ 6.32 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేతో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఫ్లూయిడ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అందించబోతుంది. ప్రధానంగా గేమింగ్‌, AI ఫీచర్లు మరియు సౌండ్ క్వాలిటీ పరంగా ఇది ఒక కంప్లీట్ ప్యాకేజీ. ఈ ఫోన్ ప్రత్యేకత ‘Plus Key’ అనే కొత్త కస్టమైజబుల్ బటన్ ఉండటం. ఇది OnePlus AI ఫీచర్లను సింగిల్ టచ్‌తో యాక్సెస్ చేయడం కోసం రూపొందించబడింది.

Join WhatsApp Group Join Now

OnePlus 13s price in India

OnePlus 13s Price in India

OnePlus 13s మూడు కలర్స్‌లో విడుదలైంది: బ్లాక్ వెల్వెట్, పింక్ సాటిన్, మరియు గ్రీన్ సిల్క్. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా, 12GB + 512GB వేరియంట్ ధర రూ.59,999గా నిర్ణయించారు. SBI కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.5,000 తగ్గింపు లభిస్తుంది. ప్రీబుకింగ్ ఇప్పటికే ప్రారంభమై, జూన్ 12 నుంచి ఓపెన్ సేల్ ప్రారంభమవుతుంది. కెమెరా విభాగంలో 32MP సెల్ఫీ కెమెరా (ఆటోఫోకస్‌తో), 50MP డ్యూయల్ రియర్ కెమెరా కాంబినేషన్ ఉంది. Wi-Fi G1 చిప్‌తో పాటు 5.5G సపోర్ట్ ఉంది. 120fps బాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా గేమ్‌ను ఎక్కువసేపు స్టేబుల్‌గా ఆడేలా ట్యూన్ చేశారు.

OnePlus 13s price in India

ఈ ఫోన్‌లో 6260mAh బ్యాటరీ ఉంది, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో. మొదటిసారిగా ‘Plus Mind’ అనే కాంటెక్స్‌ట్-అవేర్ AI ఫీచర్ లభిస్తుంది. ఇది యూజర్ అవసరమైన సమాచారం స్టోర్ చేసి, భవిష్యత్తులో ఆ సమాచారాన్ని రీట్రీవ్ చేయగలదు. ఈ ఫీచర్ టెక్నాలజీ లవర్స్‌కు ఒక కొత్త ఆవిష్కరణగా నిలుస్తుంది. OnePlus ఈ ఫోన్ ద్వారా AI ఆధారిత వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫోన్ డిజైన్, పనితీరు, బ్యాటరీ లైఫ్ అన్ని విషయంలో ఇది మిడ్-ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లలో ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. OnePlus బ్రాండ్‌కు ప్రత్యేకంగా అభిమానం ఉన్నవారికి ఈ ఫోన్ మరింత హిట్ కావచ్చు.

ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics, clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest, making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →