TELANGANAPATRIKA (June 10) : ఓదెల మల్లికార్జున స్వామి దర్శించిన మంత్రి వివేక్. పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఒగ్గు డోలు, కావడి సళ్లతో గొల్ల కురుమలు ఘన స్వాగతం పలికారు.

ఓదెల మల్లికార్జున స్వామి దర్శించిన మంత్రి వివేక్ ఘన స్వాగతం, పూర్ణకుంభం తో శుభాకాంక్షలు
పెద్దపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అల్లం సతీష్ అనే అభిమాని మొక్కుకున్న నూటొక్క కొబ్బరికాయలు కొట్టేందుకు మంత్రి ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేశారు.
కాక వెంకటస్వామి సేవలను గుర్తు చేసిన మంత్రి
మంత్రి మాట్లాడుతూ –
“ఈ ఆలయం మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనది. మా తండ్రి కాక వెంకటస్వామి గారు ఎన్నోసార్లు దర్శించుకున్నారు. ఆయన సీసీ రోడ్డు నిర్మించి ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించారు,” అని అన్నారు.
MP నిధుల ద్వారా అభివృద్ధి హామీ
“తాను, తన కుమారుడు ఎంపీ వంశీకృష్ణ కలిసి పెద్దపల్లి ప్రజల కోసం పనిచేస్తామని, ఆలయ అభివృద్ధి కోసం ఎంపీ నిధులు కేటాయిస్తామని” మంత్రి వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
గుండేటి ఐలయ్య యాదవ్,అల్లం సతీష్,శ్రీనివాస్ గౌడ్,బండి సది శ్రీధర్,స్టేలిన్ భిక్షపతి,ఎర్రయ్య, రవీందర్,శివ, సజాద్, రాజేశం కాకా తదితర కాంగ్రెస్ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu