TELANGANAPATRIKA (June 13) : New Nizamabad Collector Appointment. నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం 4:45 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న కలెక్టర్‌కు, అదనపు కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

New Nizamabad Collector Appointment మొదటి సమావేశం – జిల్లా స్థితిగతులపై చర్చ
తన కార్యాలయానికి చేరుకున్న కొత్త కలెక్టర్, చాంబర్‌లోకి వెళ్లి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో జిల్లా పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
స్వాగతంలో పాలుపంచుకున్న అధికారులు
కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, కలెక్టరేట్ ఏ.ఓ ప్రశాంత్, ఇతర శాఖల అధికారులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలు అందించి ఆయనకు అభినందనలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.