Telanganapatrika (July 13) : MLC Teenmar Mallanna, మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు ఆఫీసుపై చొచ్చుకుపోయి హింసాత్మకంగా ప్రవర్తించారు.

కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసిన దాడిదారులు అక్కడే ఉన్న మల్లన్నను బెదిరించారు. పరిస్థితి అదుపుతప్పడంతో మల్లన్న గన్‌మెన్ వారిని వెళ్ళిపోవాలని హెచ్చరించాడు. అయితే వారు వెళ్ళకపోవడంతో గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో జాగృతి కార్యకర్త సాయి గాయపడ్డాడు. గాయాలైన సాయిని ఆసుపత్రికి తరలించగా, బులెట్ చేతిని దాటి వెళ్లినట్టు వైద్యులు గుర్తించారు. ఘటన స్థలంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
తీన్మార్ మల్లన్న ఈ దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జర్నలిస్ట్ సంఘాలు, ప్రజాసంఘాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. మీడియా కార్యాలయాలపై దాడులు సరికావని, తనకు మరియు క్యూ న్యూస్‌కు భద్రత కల్పించాలని మల్లన్న అధికారులను కోరారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!