సర్టిఫికెట్ అప్లై చేస్తే చూపించే రేట్ ఒకటి తీసుకునే రేట్ మరొకటి పైగా మాకు ఏమి మిగుల్తది అనే హుకుం..! ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారుల కంటికి మాత్రం ఏది కనబడదు.

Telanganapatrika (June 9): Meeseva centers peddapalli ,పెద్దపల్లి జిల్లా పరిధిలో గల మండలాల్లో మీ సేవ సెంటర్లు అక్రమ వసూలకు అడ్డగా మారినవి,ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు అవినీతి అక్రమాలకు వేదికగా మారాయి.మీసేవ కేంద్రాల్లో అవినీతి జరుగుతుందని తెలిసినా సంబంధిత రెవెన్యూ అధికారులు ఆ మీసేవ సెంటర్ల వైపు కన్నెత్తి చూడడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.దీంతో మీ సేవ నిర్వాహకులు వారికి ఇష్టం వచ్చినట్లు దండుకోవడం,అదనంగా అక్రమ వసూలు చేయడం అలవాటుగా మారింది.ప్రభుత్వ పథకాలు వచ్చాయంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరు మీ సేవలోనే అప్లై చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయిస్తుంది దీనితో మీసేవ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు.కానీ మీ సేవ కేంద్రాలను కనీసం ఆకస్మిక తనిఖీ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మీసేవ నిర్వాహకులు బరితెగించి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న.
Meeseva centers peddapalli
కొన్ని మీసేవ సెంటర్లు నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీసేవ సెంటర్లకు కూత వేటు దూరంలో ఉన్న ఎమ్మార్వో కార్యాలయం ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని అక్కడ జరిగే అక్రమ వసూళ్లను అడ్డుకట్ట వేయడం లేదని జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వ సర్వీసులను పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు అవినీతి అక్రమాలకు నిలయంగా మారాయి. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా నేరుగా తమకు సంబంధించిన ధ్రువపత్రాలను తీసుకునేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు.ప్రభుత్వ కార్యాలయంలో అవినీతిని అరికట్టేందుకు ఏర్పాటు చేసిన మీ సేవా కేంద్రాలు మరింత అవినీతి కూపంగా మారాయి. ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు ధరను మీ సేవ కేంద్ర నిర్వాహకులు వసూలు చేస్తూ ప్రజలను లూటీ చేస్తున్నారు.ఇది చాలదన్నట్లు జిరాక్స్ లు, స్కానింగ్ ల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.మరోవైపు పనిపై వచ్చిన ప్రజలు మీసేవా కేంద్రాల్లో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.మీ సేవలో ఇతర సర్వీసులు కూడా ప్రభుత్వం నిర్దేశించిన ధర కంటే రెట్టింపు ధరను నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. అధికారులు పట్టించు కొక పోవడం వల్లే వారు ఇష్టం వచ్చినట్లు వసూల్ చేస్తున్నారని ఆరోపణలున్నాయి.ఇకనైనా జిల్లా సంబంధిత అధికారులు మీసేవ సెంటర్లను తనిఖీ నిర్వహించి అర్జీదారుల కు అదనపు చార్జీలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!