TELANGANAPATRIKA (June 15) : Local Body Elections Schedule Telangana. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా స్పందించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెలాఖరులోగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది.

Local Body Elections Schedule Telangana తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ – తర్వాత సర్పంచ్, మున్సిపల్
సోమవారం నిర్వహించనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరగనుంది. మంత్రి పేర్కొన్న ప్రకారం, ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తారు.
కాంగ్రెస్ శ్రేణులకు పిలుపు
ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి 15 రోజులే గడువు మిగిలినందున, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తిగా సిద్ధంగా ఉండాలంటూ మంత్రి పిలుపునిచ్చారు. స్థానికంగా పార్టీ బలోపేతానికి ఈ ఎన్నికలు కీలకం కాబట్టి, గ్రామ స్థాయి నుంచి మున్సిపల్ స్థాయికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
ఎన్నికలపై స్పష్టత వచ్చే సోమవారం
క్యాబినెట్‌లో చర్చ అనంతరం ఎన్నికల షెడ్యూల్ పై స్పష్టత ఇవ్వనున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఇప్పటికే సిద్ధంగా ఉండటంతో, ఎన్నికల ప్రక్రియ త్వరితగతిన ప్రారంభం కానుంది.
Read More: Read Today’s E-paper News in Telugu
Comments are closed.