Telanganapatrika (May 20): jagtial kondagattu anjaneya. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమైయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు మొదటి రోజు భద్రాచలం శ్రీ సీతారాముల తలంబ్రాలు పట్టు వస్త్రాలు హనుమాన్ జయంతి శోభాయాత్ర వై జంక్షన్ నుంచి స్వామివారి ఆలయం వరకు కన్నుల పండుగగా సాగింది.

భద్రాచలం నుంచి వచ్చిన పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అంజన్నకు భద్రాద్రి ప్రధాన అర్చకులు పూజలు చేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మూడు రోజుల పాటు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. గురువారం జరిగే పెద్ద జయంతి ఉత్సవాలకు స్వామి వారికి చందన అలంకంరణ, పల పంచామృతాభిషేకం, పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు భారీగా కొండపైకి తరలి వస్తున్నారు. కొండంతా రామనామస్మరణతో మారు మోగుతోంది. వివిధ శాఖ ల అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పోలీస్ సిబ్బంది బందో బస్తు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా కళ్యాణ కట్ట, కోనేరు, ఆలయం లోకి భక్తులు వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మూడు రోజులపాటు సంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీకాంత్ రావు, భద్రాచలం సీతారామచంద్ర ఆలయం ఈవో రమాదేవి, అర్చకులు జితేంద్రప్రసాద్, చిరంజీవి, కపిందర్, అధికారులు సునీల్, ఉమామహేశ్వర్, శ్రీనివాస్, చంద్రశేఖర్, కాంగ్రెస్ నాయకులు ఏఎంసి చైర్మన్ బత్తిని మల్లేశ్వరిశ్రీనివాస్, ముత్యం శంకర్, దారం ఆదిరెడ్డి, వెల్మ లక్ష్మారెడ్డి, రాజా నర్సింగ్ రావు, మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, నేరెళ్ళ సతీష్ రెడ్డి, నక్క అనిల్, కటకం వినయ్, కోరేపు వెంకటేష్, కంటే అరుణ్, బండి రవి తదితరులు పాల్గొన్నారు.
Jagtial kondagattu anjaneya

Read Also: Medipally Sathyam: టింబర్ డిపో – గాయత్రి కో- ఆపరేటివ్ బ్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం