
TELANGANA PATRIKA(JUN 4) , Jagtial Advanced Technology Center , జగిత్యాల జిల్లాలో భారీ స్థాయిలో నిర్మాణం పొందుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) అభివృద్ధి పనులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్వయంగా పరిశీలించారు. రూ.29 కోట్ల వ్యయంతో, టీఆర్ నగర్ సమీపంలో ఉన్న ఈ కేంద్రం నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Jagtial Advanced Technology Center రహదారి సదుపాయాలపై ప్రత్యేక దృష్టి
ఈ ATC నిర్మాణ స్థలాన్ని జగిత్యాల-కరీంనగర్ ప్రధాన రహదారి నుండి 800 మీటర్ల దూరంలో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన రహదారి సదుపాయాలను అందించేందుకు రెవిన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, తహసీల్దార్ శ్రీనివాస్, డివిజన్ సర్వేయర్ విట్టల్‌తో కలిసి పరిశీలించారు. సాంకేతికతను కేంద్రంగా చేసుకుని యువతకు అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో కేంద్రాన్ని వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
CM, IT మంత్రుల ప్రోత్సాహంతో అభివృద్ధి
“తెలంగాణ రైసింగ్ వన్” నినాదంతో రాష్ట్రాన్ని సాంకేతిక రంగంలో ముందుకు తీసుకెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సంకల్పానికి అనుగుణంగా ఈ కేంద్రం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే అన్నారు. యువతకు నైపుణ్యం పెంచేందుకు ఇది కీలక కేంద్రంగా మారబోతుందని చెప్పారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం తదితర నేతలు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu