International Justice Day Celebration: వేములవాడలో వేడుకలు

Telanganapatrika (జూలై 17) : International Justice Day Celebration – వేములవాడ బార్ అసోసియేషన్ న్యాయవాదులు కేక్ కట్ చేస్తూ న్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు.

Join WhatsApp Group Join Now

International Justice Day Celebration by Vemulawada Lawyers at Court Association

International Justice Day Celebration.

  • ఘనంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవ వేడుకలు
  • కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న న్యాయవాదులు
  • న్యాయమూర్తులకు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపిన తోటి న్యాయవాదులు

వేములవాడ, అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో గురువారం న్యాయవాదులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, జూలై 17 అంతర్జాతీయ నేర న్యాయ వ్యవస్థను, న్యాయం కోసం పోరాడే వారిని గుర్తుచేస్తుందని తెలిపారు. మారణహోమం, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే తీవ్రమైన నేరాలకు బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు:

సీనియర్ కోర్టు ఏజీపీ బొడ్డు ప్రశాంత్ కుమార్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కటకం జనార్ధన్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, గుడిసె సదానందం, పొత్తూరు అనిల్ కుమార్, కోళ్ల శ్రీనివాస్, విద్యాసాగర్ రావు, మాదాసు దేవయ్య, ప్రతాప సంతోష్, పిట్టల మనోహర్, నక్క దివాకర్, నడిగొట్ల హరికృష్ణ, నేదూరి అభిలాష్, భీమా మహేష్ బాబు, కనికరపు శ్రీనివాస్, గుడిపల్లి మహేష్, జనార్ధన్, మహిళా న్యాయవాదులు జక్కుల పద్మ, సరిత, అన్నపూర్ణ తదితరులు.

తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన వివరాలు అక్కడే లభిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *