TELANGANAPATRIKA (June 10) : Illegal Registration of Ceiling Land in Telangana. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాజుపల్లి గ్రామ శివారులో జరుగుతున్న భూ అక్రమాలు మరోసారి ప్రజల ఆగ్రహానికి దారి తీస్తున్నాయి. గ్రామ శివారులోని సర్వే నంబర్ 407/2 లో ఉన్న 71 గుంటల సీలింగ్ భూమిపై గత రెండు దశాబ్దాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Illegal Registration of Ceiling Land in Telangana సీలింగ్ భూమి అయినా ఎలా జరిగాయి రిజిస్ట్రేషన్లు?
1979 నుండి సీలింగ్ యాక్ట్ అమలులో ఉన్న ఈ భూమిని, 2005 నుండి ఇప్పటి వరకు 50కి పైగా సార్లు రిజిస్ట్రేషన్ చేసారని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇది illegal registration of ceiling land in Telangana అనే అంశంపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. అసలు సీలింగ్ భూమి అయినా, అధికారులు ఎలా రిజిస్ట్రేషన్ లు చేసారు అనే ప్రశ్నను ప్రజలు లేవనెత్తుతున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ నిర్లక్ష్యం?
సర్వే నెంబర్ 407/2 ప్రోహిబిటెడ్ లిస్ట్‌లో లేకపోవడం, సంబంధిత రెవెన్యూ అధికారులు సీలింగ్ ఆర్డర్ కాపీని రిజిస్ట్రేషన్ శాఖకు అందించకపోవడం వల్లే ఈ అక్రమాలు జరిగాయని ప్రజలు అంటున్నారు. హేచ్చరిక బోర్డులు పెట్టిన రెండో రోజే ఎవరో తొలగించడమే కాదు, క్రయ విక్రయాలకు సంబంధించి తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ ఏ చర్యలు తీసుకోకపోవడంపై మండిపడుతున్నారు.
ధరణిలో అసలు హక్కుదారులే?
గతంలో దళితుల కోసం కేటాయించిన ఈ భూమి ప్రస్తుతం ధరణి పోర్టల్ లోనూ వారిపేర్లకే ఉంది. అంటే సాంకేతికంగా భూమి వారిదే ఉన్నా, భౌతికంగా మాత్రం ఇతరులవద్ద ఉండటం బాధాకరం.
ప్రజలు చేసిన డిమాండ్లు
గ్రామంలో ఉన్న నిరుపేదలకు ఈ భూమిని ఇళ్లు లేక నివాస స్థలంగా కేటాయించాలని గ్రామసభలో తీర్మానించబడినట్లు సమాచారం. ఇదే విషయాన్ని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ల దృష్టికి తీసుకెళ్లామని స్థానిక ప్రజాప్రతినిధులు తెలిపారు.
ప్రభుత్వ స్పందన అవసరం
కొత్తపల్లి మండలంలో జరిగిన అక్రమ భూ రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్టు జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా దేశరాజుపల్లి గ్రామంలోనూ సీలింగ్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


Read More: Read Today’s E-paper News in Telugu