Telanganapatrika (July 12): Harish Rao , సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న దేవాలయాల నిర్మాణానికి మాజీమంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు రూ.1.5 లక్షల విరాళం అందించారు. నంగునూరులో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి రూ.ఒక లక్ష రూపాయలు విరాళం అందజేశారు. రెడ్డి సంఘం సభ్యులు ఇటీవల హరీష్ రావు గారిని కలసి అమ్మవారి దేవాలయానికి హరీశ్ రావు సహాయం కావాలని కోరారు.

Harish Rao శ్రీ మహంకాళి దేవాలయానికి రూ.1.5 లక్షల విరాళం
ఈ మేరకు రెడ్డి సంఘం నాయకులకు శనివారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో రూ.ఒక లక్ష అందించారు. భవిష్యత్ లో దేవాలయ అభివృద్ధికి మరింత సహాయం అందిస్తానని రెడ్డి సంఘం ప్రతినిధులకు చెప్పారు. నంగునూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని ఇటీవల ఎస్సీ సంఘం సభ్యులు ఇటీవల హరీశ్ రావుని కలసి కోరారు. ఈ మేరకు ఈ వారం సిద్దిపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ సంఘం సభ్యులకు ఎల్లమ్మ దేవాలయం నిర్మాణానికి రూ.50 వేలు అందజేశారు. ఈ సందర్బంగా రెడ్డి సంఘం, ఎస్సీ సంఘం నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu