Telanganapatrika (July 17) : Free Medical Camp, సిరిసేడు గ్రామంలో బాలవికాసం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి, ప్రజలకు ఉచిత మందుల పంపిణీ జరిగింది.

- బాలవికాసం సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
- పరిసరాల పరిశుభ్రత పాటించాలి
Free Medical Camp.
హుజురాబాద్ : ఆధునిక జీవనశైలి వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు ఎంతో ప్రీతికరంగా తిని జంక్ ఫుడ్, నూనెలో తీసిన పదార్థాలు ఒకసారి వాడిన నూనెను పదేపదే వాడడం వల్ల ప్రాణాంతకమైన జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్ గుండె జబ్బులు వస్తున్నాయని జమ్మికుంట శ్రీ కార్తికేయ ఆసుపత్రి వైద్యులు ముక్కా శరత్ బాబు ముక్కా మౌనికలు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇల్లంతకుంట మండలం సిరిసేడు గ్రామంలో బాలవికాస ఆధ్వర్యంలో శ్రీ కార్తికేయ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆహారంతోనే వ్యవహారం అని ప్రజలు ఆ విషయంలో ఏది పడితే అది తినకుండా ఆచితూచి తినాలని వారు కోరారు.
ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిరిసేడు గ్రామ యువ నాయకుడు జవ్వాజి కుమార్ మాట్లాడుతూ ఈరోజుల్లో వైద్యం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని రోగాలు వచ్చిన తర్వాత బాధపడే కంటే అవి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యగా సూచి శుభ్రత పాటించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా బాలవికాస జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ సాత్వికాహారం పట్ల మక్కువ చూపాలని మహిళలు చైతన్యవంతులైతేనే కుటుంబాలు బాగుపడతాయని తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఆవిర్భవిస్తుందని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బాలవికాస సంస్థ కోఆర్డినేటర్ స్వాతి, శ్రీ కార్తికేయ హాస్పిటల్ స్టాఫ్ ఐత రమేష్, రాము, అలేఖ్య, శృతి మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Balavikasa Official Website - Click Here
Sri Karthikeya Hospital - Click Here
ఇంకా ఆరోగ్య సమాచారం కోసం తెలంగాణ పత్రికను తరచూ సందర్శించండి. విశ్వసనీయమైన ఆరోగ్య వార్తలు మరియు సేవల కోసం మమ్మల్ని అనుసరించండి.