Telanganapatrika (జూలై 12) : Free JEE NEET CLAT Coaching 2025, తెలంగాణలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జేఈఈ, నీట్, క్లాట్ కోర్సుల కోసం ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది. ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో జూలై 15వ తేదీ నుంచి ఈ శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు ప్రకటించారు.

ఈ శిక్షణ కోసం ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ప్రముఖ ఆన్లైన్ విద్యా సంస్థలతో ఇంటర్ బోర్డు ఒప్పందాలు చేసుకుంది. విద్యార్థులకు ఆన్లైన్ తరగతులను అందించేందుకు ఇంటరాక్టివ్ ప్లాట్ప్యానల్స్ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేయనున్నారు.
Free JEE NEET CLAT Coaching 2025:
తదుపరి ప్రకటనలో ఇంటర్ బోర్డు ప్రత్యేక టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. ప్రతి కళాశాలలో విద్యార్థులు ఈ తరగతులకు నిర్దిష్ట సమయంలో హాజరై శిక్షణ పొందేలా చర్యలు తీసుకుంటున్నారు.
“ఈ ఉచిత శిక్షణ ద్వారా మధ్యతరగతి విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలపై సరైన ప్రాధాన్యత కల్పించి, మెరుగైన ఫలితాల సాధనకు దోహదం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!