తెలంగాణ పత్రిక (APR.15), Fire Safety Awareness 2025: తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పందన అలాగే అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో.. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా ఇచ్చోడ అగ్నిమాపక కేంద్రంచే మండల కేంద్రం లో అగ్నిప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి…

అగ్నిప్రమాదం సంభవించినప్పుడు వెంటనే డయల్ 101 గురించి సిరిచెల్మ చౌరస్తా , అంబేద్కర్, కొమరం భీం చౌక్లలో, కరపత్రాలను చిరు వ్యాపారులకు, పలు దుకాణాల యజమానులకు అందజేయడం జరిగింది.అనంతరం మార్కెట్ యార్డు లో జొన్న పంటను మార్కెట్ కు తీసుకువచ్చిన రైతులకు అగ్ని ప్రమాదాలకు గల కారణాల పై అవగాహన కల్పించడం జరిగింది.స్టేట్ వేర్ హౌస్ గోధాములలో అక్కడి సిబ్బందికి కూడా అవగాహణ కల్పించడం జరిగింది.

మండల కేంద్రం లో ఆర్టీసీ బస్టాండ్ వద్ద అగ్నిప్రమాదం జరిగినప్పుడు మేము దానిని అరికట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డేమో నిర్వహించారు.ఎంతో ఎత్తు వరకు నీటి ద్వారా డెమో నిర్వహిస్తుంటే ప్రజలు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శన ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ యం.అశోక్,లీడ్ ఫైర్ మెన్ దేవేందర్,ఫైర్ మెన్ లు విజయ్ కుమార్,అంజు,అచ్యుత్ రెడ్డి, డిపిడీ ఆర్.శివాజీ తది తర సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu