Telanganapatrika (July 19): Etela Rajender, కరీంనగర్ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయాలను రచ్చరచ్చ చేశారు. “నాకు ముందు హుజురాబాద్‌లో బీజేపీకి క్యాడర్ అనే పదమే లేదు. నేను వచ్చాకే పార్టీ బలపడింది” అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Etela Rajender వ్యాఖ్యలు హుజురాబాద్ బీజేపీకి బలాన్నిచ్చింది తానేనా..?
హుజురాబాద్‌లో తన ప్రభావంతోనే బీజేపీకి ఓట్లు ఎక్కువగా వచ్చాయని, పార్లమెంట్ స్థాయిలో 50వేల మెజారిటీ వచ్చిందని ఈటల స్పష్టం చేశారు. “బయట ఒక మాట, లోపల ఇంకో మాట మాట్లాడే మరుగుజ్జు గాళ్లు” అంటూ ఆయన కొందరిపై విమర్శలు గుప్పించారు.
ఇతని వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ బీజేపీ లోపలి కలహాలను మళ్లీ వెలికి తీసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీకి తన హస్తం ఎంత ఉందో ప్రజలకు గుర్తు చేయాలని ఈటల ఉద్దేశమా? లేక ఇతని వ్యాఖ్యలు మరోసారి నాయకత్వ మార్పు చర్చకు నాంది కావాలన్న సంకేతమా అన్నదానిపై చర్చ మొదలైంది.
Read More: Read Today’s E-paper News in Telugu