Telanganapatrika (జూలై 13) : Engineering Mock Seat Allotment 2025, తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల కోసం నిర్వహిస్తున్న TS EAMCET 2025 వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా, విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈసారి నూతనంగా మాక్ సీట్ల కేటాయింపు పద్ధతి ప్రవేశపెట్టారు.

జూలై 13లోపు విద్యార్థులు మాక్ సీట్ల కేటాయింపును తనిఖీ చేసుకోవచ్చు. మాక్ కేటాయింపు ద్వారా విద్యార్థులు ముందుగానే ఏ కళాశాలలో, ఏ కోర్సులో తాత్కాలికంగా సీటు వచ్చే అవకాశం ఉందో తెలుసుకోగలుగుతారు.
Engineering Mock Seat Allotment 2025:
ఈ కేటాయింపులను పరిశీలించి, విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం కూడా కల్పించారు. జూలై 13 తర్వాత రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్ మార్పులకు అవకాశం ఉంటుంది.
మాక్ కేటాయింపుతో నచ్చిన కాలేజ్ లేదా కోర్సు రాకపోతే, విద్యార్థులు మరింత మెరుగైన కాలేజ్, కోర్సు కోసం తిరిగి ఆప్షన్లు ఇవ్వవచ్చు.
ఈ విధానం ద్వారా విద్యార్థులు తగిన ప్లానింగ్‌తో ఉత్తమ విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం తెలంగాణపత్రిక ను రోజు సందర్శించండి!