Dilip Singh Bank Account, గ్రేటర్ నోయిడాకు చెందిన దిలీప్, ఇటీవలే కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో ఓ ఆన్‌లైన్ సేవింగ్స్ అకౌంట్ తెరిచారు. ఆగస్టు 2వ తేదీన బ్యాంకు మొబైల్ యాప్‌లో లాగిన్ అయిన దిలీప్, ఖాతాలో చూపుతున్న మొత్తాన్ని చూసి అవాక్కయ్యారు.

ఇంత డబ్బా? లెక్కించలేనంత అంకెలతో షాక్!
ఖాతాలో కనిపించిన మొత్తం: రూ. 10,01,35,60,00,00,00,00,00,01,00,23,56,00,00,00,00,299
ఇది సుమారు 37 అంకెలతో ఉండటంతో దిలీప్ దానిని చదవలేకపోయారు. “గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో కూడా ప్రయత్నించాను, కానీ ఫలితం లేకపోయింది”.
Dilip Singh Bank Account “అదృష్టం వచ్చిందేమో!” అనుకున్న దిలీప్ – కానీ…
ఆ మొత్తం చూసిన వెంటనే ఇది ఏదైనా సాంకేతిక సమస్య అనే అనుమానం వచ్చినా, పదేపదే లాగిన్ చేసి చూసినా అదే మొత్తం కనిపించింది. దీంతో ఖాతాలోని డబ్బును పరీక్షించడానికి రూ.10,000 ఇతర ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయడానికి ప్రయత్నించగా, బ్యాంక్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసింది.
అంతకు ముందు ఖాతాలో ఎంత ఉందంటే…
“జమ కావడానికి ముందు నా ఖాతాలో కేవలం రూ.10 నుంచి రూ.12 మాత్రమే ఉన్నవి” అని దిలీప్ తెలిపారు. ఈ మొత్తం చూసిన దిలీప్ ఒక్కసారిగా పెద్ద లాటరీ గెలిచినట్లు ఫీలయ్యారు. కానీ ఇది ఊహించదగిన స్థాయిని మించి ఉండడంతో గందరగోళంలో పడ్డారు.
Dilip Singh Bank Account బ్యాంకు క్లారిటీ ఇచ్చింది – ఇది సాంకేతిక లోపం!
దిలీప్ బ్యాంక్‌కు వెళ్లి దీనిపై వివరణ కోరగా, కోటక్ మహీంద్ర బ్యాంక్ అధికారులు
“ఇది నిజమైన డబ్బు కాదు. ఇది ఒక సాంకేతిక లోపం వల్ల ఇలా చూపిస్తోంది. కంగారు పడకండి” అని సమాధానం ఇచ్చారు.
పోలీసుల విచారణలో ఏమి తేలింది?
డన్‌కౌర్ పోలీసు స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ సోహాన్‌పాల్ సింగ్ మాట్లాడుతూ, “ఫోన్‌పే, బ్యాంకు స్టేట్‌మెంట్‌తో చెక్ చేశాం. ఖాతాలో ఒక్క రూపాయి కూడా లేదు” అని స్పష్టం చేశారు.
ప్రజలు ఏమంటున్నారు?
బ్యాలెన్స్ స్క్రీన్‌షాట్‌లను అతని స్నేహితులు షేర్ చేయగా, అనేకమంది ఆశ్చర్యానికి గురయ్యారు.
అతనికి జీవితం మలుపుతిరిగేలా జరుగుతుందని కోరుకుంటున్నాం. అతని తల్లిదండ్రులు లేరు. బంధువుల వద్ద ఉంటున్నాడు. మంచి జరగాలని ఆశిస్తున్నాం.అని పొరుగింటి మహిళ సుమన్ దేవి అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu