Jayashankar Badi Bata: జయశంకర్ బడి బాట గిరి జలవికాసంపై కలెక్టర్ సమీక్ష 2025!

Jayashankar Badi Bata MANU CHOWDARY IAS

TELANGANA PATRIKA (MAY26) Jayashankar Badi Bata, జయశంకర్ బడి బాట, గిరి జలవికాసంపై కలెక్టర్ సమీక్ష , వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ఈ యేడాది జిల్లాలో 22,47, 800 మొక్కలు నాటుటకు లక్ష్యంగా పెట్టుకున్నామని… అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆదేశించారు. Jayashankar Badi Bata సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అటవీశాఖ ఆధ్వర్యంలో సంబంధిత శాఖలతో 2025 సంవత్సరం వనమహోత్సవ కార్యక్రమం నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖల వారీగా మొక్కలు నాటి సంరక్షించేందుకు లక్ష్యాలను నిర్ణయించడం జరిగిందని… నిర్దేశిత లక్ష్యాల మేరకు ఆయా శాఖల ద్వారా ప్రజలను, ప్రజాప్రతినిధులను, విద్యార్థులను, స్వచ్ఛంద సంస్థలను, భాగస్వామ్యం చేస్తూ మొక్కలను నాటి సంరక్షించే బాధ్యతలను సంపూర్ణంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మెదక్ ఎలుకతుర్తి జాతీయ రహదారికి ఇరువైపులా మరియు జనగామ నుండి దుద్దెడ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు చాలా అవకాశం ఉన్నందున ప్రజలకు ఉపయోగపడే మరియు పండ్లు చల్లని నీడనిచ్చే ఏపుగా పెరిగే మర్రి, రావి, చింత, వేప, మహాగని, ఇప్ప తదితర మొక్కలతో పాటు పండ్ల మొక్కలను నాటాలన్నారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలు, వసతి గృహాలలో కరివేపా, మునగా ఉసిరి, చింత మొక్కలను నాటాలని అన్నారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా అవకాశం ఉన్న ఇంటి ఆవరణలు తదితర అన్ని ప్రాంతాల్లో విరివిగా మొక్కలను నాటేందుకు సిద్ధం చేయాలని అన్నారు. అవసరమైన చోట నరేగా ద్వారా మొక్కలు నాటుటకు గుంతలు తీయాలని సూచించారు.

Join WhatsApp Group Join Now

ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం…

బడి ఈడు పిల్లలందరిని బడిలో చేర్పించేలా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని జూన్ 6వ తేదీ నుండి 19వ తేదీ వరకు పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులు ఆదేశించారు. బడి ఈడు పిల్లలందరూ తప్పకుండా బడికి వెళ్లి చదువుకోవాలనేదే ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా విద్యాశాఖ మరియు సంబంధిత శాఖలు ప్రణాళిక బద్దంగా బడిబాట కార్యక్రమాన్ని చేపట్టాలని అన్నారు. ముందుగా గత సంవత్సరం విద్యార్థులు అసలు చేరని పాఠశాలలను, మూతబడిన ప్రభుత్వ పాఠశాలలు మరియు అత్యధికంగా ప్రవేట్ స్కూల్ కు వెళ్తున్న విద్యార్థులు ఉన్న ప్రాంతాలలో విద్యాశాఖ అధికారులు ముందస్తుగా మండల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఇతర విద్యా, పంచాయతీ మరియు సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కారణాలు కనుక్కొని గ్రామాలలో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారు ప్రభుత్వం బడులకు విద్యార్థులను పంపించేందుకు వారికి ఉన్న డిమాండ్లను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి అందజేయాలని అన్నారు. మౌలిక వసతులు అవసరం ఉన్న పాఠశాలల వివరాలను ఎస్టిమేట్ చేసి అందచేయాలని అన్నారు. బడిబాట కార్యక్రమం సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలలో చదవడం వల్ల పొందే ప్రయోజనాలను తల్లిదండ్రులకు వివరించి విద్యార్థుల ఎన్రోల్మెంటును చేయించాలని అన్నారు.

Jayashankar Badi Bata ఇందిరా సౌర గిరి జలవికాసం కార్యక్రమం:

ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమంలో ద్వారా ఆర్ఓఎఫ్ఆర్ కలిగిన గిరిజన లబ్ధిదారుల భూముల అభివృద్ధి, సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమంలో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన గిరిజన రైతుల పంట భూములను అభివృద్ధి చేసుకోవడం మరియు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వం ఒక యూనిట్ కు 6 లక్షల రూపాయల చొప్పున చేయూతను అందిస్తుందని అన్నారు. రెండున్నర ఎకరాలను ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో కేవలం దౌలతాబాద్ మండలంలో మాత్రమే 41 మంది గిరిజన రైతులు 46 ఎకరాల ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను కలిగి ఉన్నారని జిల్లాలో 37 ఇందిరా సౌరగిరి జల వికాసం యూనిట్లు మంజూరయ్యాయని వెంటనే గిరిజన సంక్షేమం, రెడ్కో, హార్టికల్చర్, అగ్రికల్చర్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులు లబ్ధిదారుల భూములను పరిశీలించి పంట భూములను పంటలను పండించేందుకు అభివృద్ధి చేయడం, బోరు బావులు వేయడం లేదా బోరు బావులు వేయడానికి అనుకూలించకపోతే ఓపెన్ బావులను తవ్వడం మరియు సౌర విద్యుత్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి ఎం.జోజి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, డిపిఓ దేవకీదేవి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి, డిటిడిఓ అఖిలేష్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసమూర్తి, వ్యవసాయ, హార్టికల్చర్, రెడ్కో, గ్రౌండ్ వాటర్, వివిధ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read More: Read Today’s E-paper News in Telugu

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →