Telanganapatrika (జూలై 17) : Chalo Gun Park Protest, తెలంగాణ ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలంటూ 22న చలో గన్ పార్క్ పిలుపు.
Join WhatsApp Group
Join Now

- 22న చలో గన్ పార్క్
- తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ పిలుపు
Chalo Gun Park Protest.
- కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఉద్యమకారుల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈనెల 22వ తేదీన చలో గన్ పార్క్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు దీనిని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ పిలుపు ఇచ్చారు.
- సిరిసిల్లలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ 18 నెలలు గడుస్తున్న ఉద్యమకారుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించడం లేదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం హామీలు ఇచ్చి గద్దె నెక్కారని తీరా ఉద్యమకారుల హక్కులను విస్మరించి వారిని మోసం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు.
- తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులంతా తమ కుటుంబాలను పక్కనపెట్టి ఆర్థికంగా చితికిపోయారన్నారు. ఇప్పటికే చాలామంది చనిపోయారని ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు ప్రతి నెల 25 వేల పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు.
- ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఏనుగు మల్లారెడ్డి, ఉద్యమ కళాకారుల సంఘం నాయకులు ఎల్ల పోశెట్టి, ఫోరం నాయకులు కొండ శంకర్, కోక్కుల ఆంజనేయులు, గుజ్జె దత్తాద్రి , వేముల చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ : https://www.telangana.gov.in/
తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన వివరాలు అక్కడే లభిస్తాయి.