Telanganapatrika (జూలై 17) : Blood Donation Hero మహిళ ప్రాణాలకు రక్తదానం చేసి మానవతా సేవలో యువకుడు స్ఫూర్తిదాయక పాత్ర పోషించాడు.

Blood Donation Hero.
మల్యాల మండలానికి చెందిన ఎండి సన అనే మహిళ రక్తహీనతతో బాధపడుతూ జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆమెకు అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైందని వైద్యులు తెలిపారు. దీనిపై మల్యాల మండల చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు దూడం రామాంజనేయులు కుటుంబ సభ్యులతో కలిసి ముత్యంపేట గ్రామానికి చెందిన యువకుడు బాలే శ్రీకాంత్‌ను సంప్రదించారు. మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీకాంత్ వెంటనే జగిత్యాలకు చేరుకుని రక్తదానం చేసి మహిళ ప్రాణాలను కాపాడాడు. యువకుడి ఈ ఉత్సాహవంతమైన స్పందనకు పలు వర్గాల వారు అభినందనలు తెలిపారు.
For general information on blood donation and benefits: Click Here
తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన వివరాలు అక్కడే లభిస్తాయి.