Telanganapatrika (May 21): Acb raid 2025. నిజామాబాద్ రేంజ్ ఏసీబీ డి.ఎస్.పి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామపంచాయతీ సెక్రటరీ. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండల పరిధిలోని గొట్టిముక్కల గ్రామపంచాయతీ సెక్రటరీ గంగామోహన్ లంచం తీసుకుంటుండగా బుధవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

గొట్టుముక్కల గ్రామానికి చెందిన ముప్పడి రాజేందర్ అనే వ్యక్తికి సంబంధించిన భూ వ్యవహారంలో రూ. మొదట 20,000 లంచం డిమాండ్ చేయగా మొదటి విడుతగా 18, వేలు ఇచ్చు టకు ఒప్పందం కుదిరింది ఇట్టి రూపాయలను తీసుకునే క్రమంలో ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు, గ్రామపంచాయతీ అవినీతి అధికారి ప్రస్తుతం ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఇట్టి ఏసీబీ దాడిలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, నగేష్, వేణు, సిబ్బంది పాల్గొన్నారు.
Read More: Traffic SI: వాహనదారుడి తప్పిదం – డ్యూటీ లో ఉన్న ఎస్సైకు తీవ్ర గాయాలు