సిర్నాపల్లి వ్యక్తి సిద్దుల గుట్ట సమీపంలో మృ*తి
తెలంగాణ పత్రిక Indalwai Mandal , ఇందల్వాయి : ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామానికి ( Sirnapalli Village ) చెందిన 52 ఏళ్ల పురేందర్ గౌడ్ సిద్దుల గుట్ట సమీపంలో రోడ్డు పక్కన జారిపడి మృతి చెందాడు. ఈ విషయాన్ని ఎస్సై సందీప్ తెలిపారు.
స్థానికుల సమాచారం ప్రకారం శనివారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన పురేందర్ గౌడ్ గన్నారం పరిధిలోని సిద్దుల గుట్ట సమీపంలో రోడ్డు పక్కన పడి ఉండడం గమనించారు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే పురేందర్ గౌడ్ మృ*తి చెందినట్లు నిర్ధారించారు.
మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు మరింత విచారణ చేపట్టి మరణానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక విచారణలో జారిపడి మరణించినట్లు తేలింది.