Telanganapatrika (August 15): నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ లో అర్హులైన 88 మంది నిరుపేద జర్నలిస్టుకు ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి పట్టాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ నారాయణ అమిత్. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ విలేకరులకు పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్ కృషి ఎంతో ఉందని వారికి ఎల్లవేళలా ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా లబ్ధిదారులకు పట్టాల పంపిణీ తో పాటు త్వరలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు సహకరిస్తానని అన్నారు.

ఎమ్మెల్యే BLR వాగ్దానం ఫుల్‌ఫిల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలను స్వయంగా నేను మున్సిపల్ ఫ్లోర్ స్వయంగా వారి బాధలను చూసి ఇండ్ల స్థలాల కోసం వారు చేస్తున్న ధర్నాలకు మద్దతు పలికి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని ఆనాడు చెప్పిన మాట ప్రకారం నేడు వారికి మంత్రుల దృష్టికి కలెక్టర్ దృష్టి తీసుకువచ్చి వారితో మాట్లాడి స్థానిక సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తో కలిసి ఆరు నెలలుగా కష్టపడి వారికి నేడు పట్టాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.
ఇంకా ఏవైనా ఇబ్బందులు, సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి అని జర్నలిస్టులకు సూచించారు.అందరం కలిసి మిర్యాలగూడ అభివృద్ధి చేసేందుకు కృషి చేద్దామని అన్నారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు సమస్యను పరిష్కరించి నేడు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu