Telanganapatrika (August 05):Ila Tripathi IAS , మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేసి వినియోగంలో తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆసుపత్రి అధికారులను, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. మిర్యాలగూడ ఆస్పత్రికి 160 కే.వి జనరేటర్ మంజూరైనందున రెండు నెలల్లో జనరేటర్ ను ఆసుపత్రిలో నెలకొల్పే ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ మాతృ నాయక్ లను ఆదేశించారు .

Ila Tripathi IAS త్రిపాఠి క్లాస్ – పనుల్లో జాప్యం వద్దు..!
అలాగే ఆసుపత్రి స్థాయి వంద పడకల నుండి200 కు పెరిగినందున ఏడుగురు అదనపు సానిటేషన్ సిబ్బంది ఆసుపత్రికి మంజూరు కాగా, వారిని నియమించుకోవాలని సూచించారు.సోమవారం ఆమె మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.నూతన ఆసుపత్రి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో రికార్డులను తనిఖీ చేశారు. డాక్టర్లు, సిబ్బంది, ఓపి రిజిస్టర్ లను పరిశీలించి డాక్టర్లతో మాట్లాడారు. ఆస్పత్రికి వస్తున్న డయాలసిస్ పేషెంట్లు, నిర్వహిస్తున్న సర్జరీలు ,ఆసుపత్రిలో ఇబ్బందులు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.
నూతన భవన నిర్మాణంలో భాగంగా పెండింగ్ లో ఉన్న 4 కోట్ల 50 లక్షల రూపాయల బిల్లులను త్వరగా మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకు సంబంధించిన వివరాలను సమర్పించాలని ఆమె తెలిపారు. రోగులు వచ్చినప్పుడు కాజువాలిటీ లో డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేలా చూడాలని, ఆసుపత్రి ద్వారా ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు డాక్టర్లతోపాటు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు.
కాగా జిల్లా ఆసుపత్రుల సేవల సమన్వయకర్త డాక్టర్ మాతృనాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో గత నెల 250 సర్జరీలు నిర్వహించడం జరిగిందని, దీంతోపాటు, 20 మేజర్ సర్జరీలు చేశామని ,మోకాలు చిప్పల మార్పిడి, హిప్ మార్పిడి చికిత్సలు 20 వరకు నిర్వహించడం జరిగిందని, వివిధ అంశాలలో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుందని, అంతేకాక “లక్ష్య” పథకానికి కూడా ఈ ఆసుపత్రి ఎంపికైనట్లు తెలిపారు.ఆస్పత్రి వైద్యులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ఆసుపత్రి ద్వారా అందించాల్సిన మెరుగైన వైద్య సేవలపై చర్చించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ,ఏరియా ఆసుపత్రి సూపరింటిండెంట్, ఆసుపత్రి డాక్టర్లు, తదితరులు ఉన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu