Telanganapatrika (August 04): Dharmasthala , కర్ణాటక రాష్ట్రం ధర్మస్థల ప్రాంతంలో ఓ సోదరుడు చేసిన RTI దరఖాస్తు ఇప్పుడు సంచలనంగా మారింది. 2000 నుంచి 2015 మధ్యకాలంలో జరిగిన అసహజ మరణాల రికార్డులు కోరుతూ జయంత్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వినతిని దాఖలు చేశారు. అయితే ఆశ్చర్యకరంగా, సంబంధిత ఫైళ్లు, పోస్టుమార్టం నివేదికలు, మృ*తదేహాల ఫొటోలు అన్నీ లేనివిగా ప్రకటించడమే కాకుండా, అవి పూర్తిగా ధ్వంసం చేయబడినట్లు అధికారులు తెలిపారు.

Dharmasthala పోస్టుమార్టం నివేదికలు ఎక్కడ..?
పోలీసు వర్గాలు చెబుతున్న దాని ప్రకారం, ఈ ఫైళ్లను సాధారణ పరిపాలనా విభాగం ఆదేశాల మేరకు ధ్వంసం చేశారట. కానీ వాటిని డిజిటల్ ఫార్మాట్‌లో సేవ్ చేయకుండా ఎలా తొలగించారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. జయంత్, ఇది సూచితమైన కుట్రగా భావిస్తూ, మానవ హక్కుల సంఘాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.
ఈ పరిణామాలు ధర్మస్థల ప్రాంతంలోని గత మ*రణాలపై పలు అనుమానాలను కలిగిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu