Telanganapatrika (July 29) : Dog viral video, స్ట్రీట్ డాగ్ ప్రేమ – ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో ఒక బిజువాన్ కుక్క తన స్నేహితుడిని వదలక 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“కుక్కలు సాధారణంగా విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనాలుగా నిలుస్తాయి. అయితే, ఈ వీడియోలో కనిపించిన ఆగ్రా ప్రాంతానికి చెందిన ఓ స్ట్రీట్ డాగ్, తన మానవ మిత్రులపై చూపించిన అనుబంధం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేసింది. ఓ కుటుంబం బ్యాటరీ రిక్షాలో ఇంటిని ఖాళీ చేసి వెళ్తుండగా, ఆ కుక్క వారిని చూసి వెంట వెంటనే పరుగెత్తడం ప్రారంభించింది.”.
కుటుంబంతో ఏర్పడిన స్నేహం
ఆ కుటుంబంలో పిల్లలు ప్రతిరోజూ ఆ కుక్కకు రొట్టెలు ఇచ్చేవారు. ఈ కారణంగా ఆ కుక్క వారికి ఎంతగానో అలవాటు పడింది. ఇంటి మార్పు సమయంలో ఈ కుటుంబం తమ సామానులతో రిక్షాలో వెళ్లడం మొదలుపెట్టగానే, ఆ కుక్క వారు కంటపడగానే వెంటనే వారి వెంటే పరుగెత్తసాగింది.
వీడియో ఎలా వైరల్ అయింది?
జగదీశ్ పురా మారుతి స్టేట్ వద్ద జరిగిన ఈ ఘటనను రవీ గోస్వామి అనే వ్యక్తి గమనించి వీడియో తీశారు. ఆ వీడియోలో ఆ కుక్క పదే పదే రిక్షా వెనుక పరుగెత్తుతూ కనిపిస్తోంది. చివరికి కుటుంబం కుక్కను రిక్షాలోకి ఆహ్వానించింది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఈ అనుబంధానికి మురిసిపోతున్నారు
Read More: Telangana Mahalakshmi Scheme 2025: మహిళలకు 2500 త్వరలో!