తెలంగాణ పత్రిక గంగాధర జులై 28: ప్రభుత్వ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై దర్యాప్తులో భాగంగా గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫ్జల్ నూర్ ఖాన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కొత్తపల్లి హవెలిలో సర్వే నంబర్ 272/14కి సంబంధించిన భూమిపై గతంలో తొమ్మిది రిజిస్ట్రేషన్లు జరిగినట్టు అధికార విచారణలో తేలింది.

అయితే, ఆఫ్జల్ నూర్ ఖాన్ ఈ రిజిస్ట్రేషన్లను స్వయంగా గుర్తించి, సంబంధిత క్రయ విక్రయ దారులను పిలిపించి డాక్యుమెంట్లను రద్దు చేసినప్పటికీ, అధికార విరుద్ధ చర్యల కారణంగా ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈ భూమి గవర్నమెంట్ భూమి పరిధిలోకి వస్తుందన్న కారణంతో ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ & స్టాంపులశాఖ ఐజీ ఆదేశాలతో కరీంనగర్ డీఐజీ ఎం. రవీందర్ సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫ్జల్ నూర్ ఖాన్ భూమి రిజిస్ట్రేషన్లను రద్దు చేసినప్పటికీ, రిజిస్ట్రేషన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందన్న కారణంతో అధికారుల చర్యలు ప్రాధాన్యత పొందినట్టు తెలుస్తోంది
కొత్తపల్లి హవెలి సర్వే నం. 272/14 రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై చర్య
