Telanganapatrika (జూలై 17) : Free sarees for Telangana women , తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పథకం అమలవుతుందని ఆమె వెల్లడించారు.

15 నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలందరికీ లబ్ధి.
ఈ పథకంలో భాగంగా 15 సంవత్సరాలు నిండిన మహిళల నుంచి 60 సంవత్సరాల పైబడిన వయోజన మహిళల వరకు ఉచితంగా చీరలు అందించనున్నట్టు మంత్రి తెలిపారు. దీని అమలుకు సంబంధించి త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు విడుదల కానున్నాయి.
మహిళలకు ఉచిత చీరల పథకం – దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రభుత్వ నిర్ణయం:
స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రాధాన్యం
ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ పథకానికి ప్రధాన లబ్దిదారులుగా ఉండనున్నారు. సంఘ సభ్యులు ఐక్యంగా ఉండి వ్యాపారవేత్తలుగా ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం నిరంతరంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
Free sarees for Telangana women దసరా-దీపావళి ప్రత్యేక పంపిణీ
ఈ పథకం ప్రత్యేకంగా పండుగల సమయంలో అమలులోకి వస్తుంది. చీరల పంపిణీ ఏర్పాట్ల కోసం అధికారులు ఇప్పటికే ముస్తాబవుతున్నారు. బస్తీ నుంచి గ్రామీణ ప్రాంతాల వరకు సమగ్ర వ్యవస్థ ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
Also Read: Aadhaar Update For Children 2025 – పిల్లలకు అప్డేట్ తప్పనిసరి!