Telanganapatrika (July 16) : Government land encroachment 2025 – కుత్బుల్లాపూర్‌లో అధికారులు కనుసైగలతో ప్రభుత్వ స్థలం మాయం చేసిన ఘటన.
Join WhatsApp Group
Join Now

Government land encroachment 2025
- కబ్జాదారులకు అధికారులే దగ్గరుండి ప్రభుత్వ స్థలాలు దారాదత్తం
- కబ్జాకోరుల చేతివాటం ఎకరాలకు ఎకరాలు మాయం
- కాసుల వేటలో రెవెన్యూ యంత్రాంగం
- కుత్బుల్లాపూర్: గాజులరామారం డివిజన్ సర్వేనెంబర్ 12 ప్రభుత్వ స్థలం పూర్తిగా మాయమవుతుంది. సర్వే నెంబర్ 12 లో 12.24 గుంటలు ప్రభుత్వ స్థలం ఉంది. దీంట్లో 6.24 గుంటలు ప్రభుత్వ పాఠశాలకు, క్రీడా మైదానాలకు కేటాయించారు. 2 ఎకరాలు జెఎన్ఎన్ యూ ఆర్ ఎం కింద పేద ప్రజలకు ఇల్లు కట్టేందుకు కేటాయించారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా మిగిలిన నాలుగు ఎకరాలు ఎక్కడ అని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ అధికారులు కబ్జా దారులతో కుమ్మక్కై అప్పనంగా ప్రభుత్వ భూమిని అప్పజెప్పారని విమర్శిస్తున్నారు. కబ్జాదారుడు ప్రభుత్వ స్థలంలో ఉండాల్సిన ప్రభుత్వ భూమి బోర్డును పక్కనే ఉన్న ప్రైవేట్ వెంచర్ లో పాతడం జరిగిందన్నారు.
- కబ్జాదారుడి కనుసైగల్లో నడుస్తున్న రెవెన్యూ అధికారుల యంత్రాంగం ప్రైవేట్ పట్టా సర్వే నంబర్ 445 చూపిస్తూ సర్వేనెంబర్ 12 లో సుమారు నాలుగు ఎకరాలు కబ్జా చేసి అందులో టీ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వానికే సవాలు విసిరిన కబ్జాదారుడు సుమారు 18 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు స్థానిక కుత్బుల్లాపూర్ తాసిల్దార్ కి ఫిర్యాదులు చేసినప్పటికీ నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరించడం జరిగిందన్నారు.
- అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వే పేరు చెప్పి కాలయాపన చేయడం తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. ఒక సర్వే జరిపించడానికి ప్రభుత్వ ఆస్తిని కాపాడడానికి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కబ్జాదారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. రెవెన్యూ అధికారులు, కబ్జాదారుల మధ్య ఉన్న చీకటి ఒప్పందమే దీనికి నిదర్శనమన్నారు. 2019లో హరితహారం లో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఇదే స్థలంలో హరితహారం కార్యక్రమం నిర్వహించి చెట్లు నాటడం జరిగిందన్నారు. నేడు చెట్లు మాయమయ్యి కబ్జాదారుడు ప్రత్యక్షమయ్యాడని అన్నారు. కబ్జాదారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ మండల కార్యాలయంలో తాసిల్దార్ కి స్థానిక బిజెపి నాయకులు గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సాయినాధ్ నేత జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Telangana Revenue Department (ప్రభుత్వ ముఖ్య లాండ్స్ నిర్వహణ): అధికారిక సమాచారం, పాలసీలు, మరియు కోంటాక్ట్ వివరాల కోసం telangana.gov.in/departments/revenue
తాజా వార్తల కోసం తెలంగాణ పత్రికను సందర్శించండి. అన్ని ముఖ్యమైన వివరాలు అక్కడే లభిస్తాయి.