Telanganapatrika (July 16): PMJJBY , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామ నివాసులైన బానోతు జైత్రం మరియు కునుషోత హత్తి రామ్ లు ఇటీవల మ*రణించారు. వారి నామినీలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన (PMJJBY) పధకం క్రింద రెండు లక్షల రూపాయిల చెక్కులను భద్రాద్రి కొత్తగూడెం ఎల్.డి. ఎం . రామిరెడ్డి మరియు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ పృథ్వీరాజు , అశోక్ చక్రవర్తి అందించారు.

PMJJBY ప్రమాదం అనుకోకుండా వస్తుంది, రక్షణ ముందే ఉండాలి – రూ.20లలో రక్షణ..!
ఈ సందర్భంగా ఎల్. డి. ఎం. మాట్లాడుతూ PMJJBY మరియు PMSBY పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలనీ, కేవలం సంవత్సరానికి 436 రూపాయిలతో జీవిత బీమా మరియు 20 రూపాయిలతో ప్రమాద భీమా పొందవచ్చని తెలిపారు.
అన్ని బ్యాంక్ శాఖలు మరియు పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పథకం పొందవచ్చని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామపంచాయతీ లో అవగాహన మరియు ఇన్సూరెన్స్ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో విడ్స్ స్వచంద సంస్థ సీసీ నాగరాజు, కౌన్సిలర్స్ నవీన్, పవన్ కుమార్, కళ్యాణి, సెర్ఫ్ సిసి శిరీష, బ్యాంక్ మిత్ర చందులాల్, వివో ఏ లీలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సి. యస్.పి. జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ మరియు సి. యస్. పి లు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu