Telanganapatrika (జూలై 14): Dengue Vaccine India Trials 2025, భారతదేశంలో తయారవుతున్న మొట్టమొదటి దేశీయ డెంగ్యూ టీకా “డెంగీఆల్” (Dengual) త్వరలో ప్రజల వినియోగానికి అందుబాటులోకి రానుంది. ఈ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు చేరుకున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత వైద్య పరిశోధన మండలి (ICMR) ఆధ్వర్యంలో, ప్రముఖ ఫార్మా సంస్థ పనసియా బయోటెక్ (Panacea Biotech) సంయుక్తంగా అభివృద్ధి చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 20 ప్రధాన నగరాల్లో ఈ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. ఇందులో భాగంగా దాదాపు 8 వేల మంది పైగా వాలంటీర్లు పాల్గొన్నారు.
ట్రయల్స్ చివరి దశలో మొత్తం 10,500 మంది వాలంటీర్లను నమోదు చేయాల్సి ఉండగా, అక్టోబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం.
ఇప్పటికే డెంగ్యూ కేసులు సంవత్సరానికి లక్షల్లో నమోదవుతున్న నేపథ్యంలో, ఈ టీకా వస్తే ప్రజారోగ్యంలో విప్లవాత్మకంగా మారనుంది.
ఇది ప్రజలకు సురక్షితమైన, ప్రభావవంతమైన నివారణ పద్ధతిగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారిక అనుమతుల ప్రక్రియను వేగవంతం చేస్తే, ఈ ఏడాది చివర్లో లేదా 2026 ఆరంభంలో టీకా లభించనుంది.
రాబోయే రోజుల్లో డెంగ్యూ వ్యాధిని నియంత్రించేందుకు ఈ టీకా ప్రధాన పాత్ర పోషించనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!