Telanganapatrika (July 14): MLA Kuna Srisailam Goud Visit 2025, రవి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2లో పర్యటించిన ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.

MLA Kuna Srisailam Goud Visit 2025.
రవి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, కాలనీలలో ఎటువంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కున శ్రీశైలంగౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి గాజులరామారం డివిజన్ లోని రావి నారాయణరెడ్డి నగర్ ఫేస్-2 కాలనీ వాసుల ఆహ్వానం మేరకు కాలనీలలో పర్యటించారు. అనంతరం నూతన సీసీ రోడ్ల ఏర్పాటు కొసం రాష్ట్ర నాయకులు కున శ్రీశైలం గౌడ్ సంబంధిత అధికారులతో మాట్లాడి 84 లక్షలతో కూడిన సీసీ రోడ్లు మంజూరు చేయించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో ప్రజల సంక్షేమానికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గత 10 సంవత్సరాలు అభివృద్ధికి నోచుకోలేని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నేడు ఇన్ ఛార్జ్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో కుత్బుల్లాపూర్ అభివృద్ధి చెందుతుందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రజా నాయకుడి వద్దకు వచ్చే మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని ఎంచుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సాయి ప్రసాద్, మురళి, లక్ష్మయ్య, ధర్మారావు, రమేష్, శ్రీనివాస్ రావు, మల్లేశ్, లోకనాధం, సురేష్, మహేష్, జగన్నాధం, లక్ష్మణ్ రావు, రఘుపతి, రాము, సతీష్, మన్మధరావు, అప్పన్న కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — తెలంగాణపత్రిక లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్‌కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.