TelanganaPatrika(jun 8): Vivek Venkataswamy , తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన చెన్నూర్ శాసనసభ్యులు గౌరవ శ్రీ వివేక్ వెంకటస్వామి గారు, నూతనంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.

Vivek Venkataswamy కి నేతల నుండి శుభాకాంక్షలు..
హైదరాబాద్‌లోని తన నివాసంలో గౌరవ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన మందమర్రి పట్టణ కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్, దుర్గం నరేష్, నార్లపూర్ వెంకన్నా శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ లో నూతన ఊపు
వివేక్ వెంకటస్వామి మంత్రిగా నియమితులవడం ద్వారా చెన్నూర్ నియోజకవర్గానికి అభివృద్ధి దిశగా కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి.
Read More: Read Today’s E-paper News in Telugu