
Telangana patrika (May 31): హైదరాబాదులోని జలవిహార్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) 25 వసంతాల సంబురాల కార్యక్రమానికి శివసేన పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జ్ గౌట గణేష్ హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ 2001లో ఏర్పడ్డ తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం (టీజేఎఫ్) తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. తెలంగాణ కోసం కొట్లాడి రక్తం చిందించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం పలువురు జర్నలిస్టులు ఆత్మ బలిదానాలు చేశారని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వ దమనకాండపై తమ కళాలతో ఎండగట్టారని తెలిపారు. జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపిన పాలకులపై తిరుగుబాటు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25 వసంతాల సంబురాలు జరుపుకోవడం గర్వంగా ఉందని అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచి నేటి వరకు తెలంగాణ కోసం పోరాడుతున్న టీజేఎఫ్ ప్రస్థానం ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిజం పనిచేస్తుందని జర్నలిస్టులకు ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశా
ఇంకా ఇలాంటి విశ్లేషణాత్మక వార్తల కోసం www.telanganapatrika.in ను రోజు సందర్శించండి!