
Telanganapatrika (May 20): kondagattu anjaneya ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం నుండి పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర నలుమూలల నుండి లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. ఈ సందర్భంగా ప్రసాదం ఆచరించి దైవభక్తి చాటుకుంటారు. పెద్ద జయంతి సందర్భంగా దీక్ష స్వాములు దర్శనానికి తరలివచ్చిన భక్తులు ప్రసాద కౌంటర్ల రెండు ఏర్పాటు చేయడంతో ప్రసాదం కొనడానికి భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. లక్షలాది భక్తులు రెండు కౌంటర్లే ఏర్పాటు చేయడం భక్తులు అసహనం వ్యక్తం చేశారు. అధికారులు మొత్తం 7 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించినప్పటికీ, కేవలం 2 కౌంటర్లే ఏర్పాటు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. స్వామి దర్శనం కంటే ప్రసాదం పొందడమే పెద్ద పరీక్షగా మారగా భక్తులు విసుగు చెందారు. దీక్షలు చేపట్టిన అనేక మంది భక్తులు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. ఎంతో భక్తితో పవిత్రమైన దేవాలయానికి వచ్చిన భక్తులకు అధికారులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు.
kondagattu Anjaneya 2025 News

Read More: Medipally Sathyam: టింబర్ డిపో – గాయత్రి కో- ఆపరేటివ్ బ్యాంకు ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యం
Comments are closed.