తెలంగాణ పత్రిక (MAY 01) , MI VS RR టాస్ ఓడిపోయి బాటింగ్ దిగిన ముంబై భారీ స్కోర్ చేసింది. ముంబై ఇండియన్స్ (MI) ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ (RR) పై జరిగిన మ్యాచ్‌లో 217/2 పరుగులు చేసి భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు రికెల్టన్ మరియు రోహిత్ శర్మ శతక భాగస్వామ్యం చేసి జట్టుకు శుభారంభం అందించారు. అనంతరం సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా వేగంగా పరుగులు చేసి జట్టును భారీ స్కోర్‌కి తీసుకెళ్లారు.ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 217 పరుగులు సాధించింది.

MI VS RR ఈ మ్యాచ్ గెలిస్తే
ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తిరుగులేని ఆటతీరుతో వరుసగా విజయాలు సాధిస్తూ అభిమానులను అలరిస్తోంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా నాయకత్వంలో జట్టు సమిష్టిగా రాణిస్తూ ఈ మ్యాచ్ లో ను గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుతుంది

Read More: Read Today’s E-paper News in Telugu