State Level: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని గట్ల మల్యాల ఉన్నత పాఠశాల విద్యార్థులు State Level రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఏప్రిల్ 26న జడ్పీహెచ్ఎస్ గట్లమల్యాలో నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎనిమిది మంది విద్యార్థులు – బి.ఈశ్వరి, ఎం.వైష్ణవి, ఎస్.కిరణ్వి, బి.షణ్ముఖ ప్రియ, డి.అను, బి.అశ్విని, బి.హరిణి ప్రియ, బి.అఖిల – రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మే 2 నుంచి 4వ తేదీ వరకు జగిత్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టుగా పాల్గొంటారు.
State Level 8 విద్యార్థులు

State Level రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులు
ఈ సందర్భంగా ఏప్రిల్ 26 నుంచి మే 1 వరకు పాఠశాలలో ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. రమేశ్ సమన్వయంలో, ఫిజికల్ డైరెక్టర్ దర్శనాల రాజ్ కుమార్ శిక్షణను అందించారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామస్తులు, ఆప్ కమిటీ సభ్యులు హర్షంగా అభినందించారు.
Read More: Read Today’s E-paper News in Telugu